మహిళా క్రికెటర్పై నిషేధం | Sakshi
Sakshi News home page

మహిళా క్రికెటర్పై నిషేధం

Published Thu, Feb 4 2016 4:27 PM

మహిళా క్రికెటర్పై నిషేధం

సిడ్నీ: ఇటీవల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఓ మహిళా క్రికెటర్ అమితోత్సాహం చూపించింది. తాను క్రీడాకారణి అనే సంగతిని కూడా మరచి బెట్టింగ్ పాల్పడింది. ఆస్ట్రేలియాలో జరిగే మహిళా బిగ్ బాష్ లీగ్ లో పెర్త్ స్కార్చర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించే పీపా క్లీరే(19) పదకొండు డాలర్లను( సుమారు రూ.700) బెట్టింగ్ వేసింది.  

ఇటీవలే ఈ విషయం బయటపడటంతో  ఆస్ట్రేలియాలోని ఏ క్రికెట్ లోని పాల్గొనే అవకాశం లేకుండా ఆరు నెలల పాటు నిషేధానికి గురైంది. మరోవైపు ఆమె బెట్టింగ్ ఘటనపై బిగ్ బాష్ లీగ్ కూడా తీవ్రంగా స్పందించింది. ఆమెను 18 నెలల పాటు బిగ్ బాష్ నుంచి సస్పెండ్ చేసింది.


గతేడాది డిసెంబర్ లో ఆసీస్ మహిళా క్రికెటర్  రీక్స్  బెట్టింగ్ పాల్పడి రెండేళ్ల నిషేధానికి గురైన సంగతి తెలిసిందే.  ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌పై 9 డాలర్లు  పందెంగా కాసి చిక్కుల్లో పడింది.  చిన్నమొత్తంలో బెట్టింగ్ లు వేసి తమ క్రికెట్ జీవితాన్నిపణంగా పెట్టడం ఆసీస్ క్రికెట్ లో కలకలం రేపుతోంది.

Advertisement
Advertisement