వన్డేలకు హాడిన్ వీడ్కోలు | Australia wicketkeeper brad haddin quits one day game | Sakshi
Sakshi News home page

వన్డేలకు హాడిన్ వీడ్కోలు

May 18 2015 1:38 AM | Updated on Sep 3 2017 2:14 AM

వన్డేలకు హాడిన్ వీడ్కోలు

వన్డేలకు హాడిన్ వీడ్కోలు

ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు అధికారికంగా వీడ్కోలు పలికాడు.

సిడ్నీ: ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు అధికారికంగా వీడ్కోలు పలికాడు. ప్రపంచకప్ విజయానంతరం గత మార్చిలోనే తాను ఇక వన్డేలు ఆడలేనని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా 126 వన్డేలు ఆడిన హాడిన్ 3,122 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 16 హాఫ్ సెంచరీలున్నాయి.

అలాగే 170 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లు చేశాడు. ‘నా వన్డే కెరీర్ అద్భుతంగా సాగింది. ఆసీస్ తరఫున మూడు ప్రపంచకప్‌ల్లో పాలుపంచుకున్నాను. ఇక ముగింపునకు ఇదే సరైన సమయంగా భావించాను’ అని 37 ఏళ్ల హాడిన్ తెలిపాడు. అయితే టెస్టు ఫార్మాట్‌లో కొనసాగుతున్న హాడిన్ నేడు (సోమవారం) వెస్టిండీస్, ఇంగ్లండ్‌లతో టెస్టు సిరీస్ కోసం జట్టుతో పాటు వెళ్లనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement