ఇంగ్లండ్ తో శుక్రవారమిక్కడ జరుగుతున్న వన్డేలో లక్ష్యాన్ని ఛేదించే దిశగా ఆస్ట్రేలియా 161 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
హొబర్ట్: ఇంగ్లండ్ తో శుక్రవారమిక్కడ జరుగుతున్న వన్డేలో లక్ష్యాన్ని ఛేదించే దిశగా ఆస్ట్రేలియా 161 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్ వెల్(37) నాలుగో వికెట్ గా అవుటయ్యాడు. 35 ఓవర్లలో 201 పరుగులతో ఆట కొనసాగిస్తోంది. కెప్టెన్ డేవిడ్ స్మిత్ అర్థ సెంచరీ సాధించాడు. స్మిత్(55), ఫాల్కనర్(27) క్రీజ్ లో ఉన్నారు.
ఫించ్ 32, మార్ష్ 45 పరుగులు చేసి అవుటయ్యారు. వైట్ డకౌటయ్యాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది.