ఫైనల్లో జీవన్‌ జంట 

Atp tennis Jeevan doubles reached to finals - Sakshi

న్యూఢిల్లీ: చెంగ్డూ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు జీవన్‌ నెడుంజెళియన్‌ డబుల్స్‌ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించాడు. చైనాలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో జీవన్‌–ఆస్టిన్‌ క్రాయిసెక్‌ (అమెరికా) ద్వయం 7–5, 6–1తో గిడో పెల్లా (అర్జెంటీనా)–జావో సౌసా (పోర్చుగల్‌) జోడీపై గెలిచింది. జీవన్‌ కెరీర్‌లో ఇది రెండో ఏటీపీ డబుల్స్‌ ఫైనల్‌. 2017లో అతను రోహన్‌ బోపన్నతో కలిసి చెన్నై ఓపెన్‌లో టైటిల్‌ గెలిచాడు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top