చాంప్స్‌ ఆదిత్య, సురేంద్ర | Athletcis Champions Aditya and Surendra | Sakshi
Sakshi News home page

చాంప్స్‌ ఆదిత్య, సురేంద్ర

Apr 15 2019 3:15 PM | Updated on Apr 15 2019 3:15 PM

Athletcis Champions Aditya and Surendra - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసీ) ఆధ్వర్యంలో ఆదివారం అథ్లెటిక్స్‌ మీట్‌ జరిగింది. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన పురుషుల ఐదు కిలోమీటర్ల రేసులో వి. ఆదిత్య... పది కిలోమీటర్ల రేసులో సురేంద్ర పరవాడ విజేతలుగా నిలిచారు.

ఐదు కిలోమీటర్ల విభాగంలో ప్రీతమ్‌ కుమార్‌ సింగ్‌ రెండో స్థానంలో, శాంతను మూడో స్థానంలో నిలిచారు. పది కిలోమీటర్ల విభాగంలో విజ్ఞాన్‌ రాచబత్తుని రెండో స్థానాన్ని, అనిల్‌ మూడో స్థానాన్ని పొందారు. హైసీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైసీ అధ్యక్షుడు బొల్లు మురళి కూడా పాల్గొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement