రంజీ ట్రోఫీ మ్యాచ్ మొదటి రోజు అస్సాంను హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేశారు. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మంగళవారం ఆట ముగిసే సమయానికి అస్సాం తొలి....
హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ మ్యాచ్ మొదటి రోజు అస్సాంను హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేశారు. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మంగళవారం ఆట ముగిసే సమయానికి అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 92 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. శివ్‌శంకర్ రాయ్ (183 బంతుల్లో 72; 7 ఫోర్లు), గోకుల్ శర్మ (121 బంతుల్లో 54; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు.
వీరిద్దరు మూడో వికెట్‌కు 112 పరుగులు జోడించి అస్సాం ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ప్రస్తుతం తర్జీందర్ సింగ్ (25 బ్యాటింగ్), ధీరజ్ జాదవ్ (21 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న హైదరాబాద్ బౌలర్ అశోక్ అయ్యంగార్ హర్ష 2 వికెట్లు పడగొట్టగా, ఆశిష్ రెడ్డి, మెహదీ హసన్ ఒక్కో వికెట్ తీశారు.