ధోనీకి గాయం.. పార్థివ్కు పిలుపు | Asia Cup: Parthiv Patel to join Team India as cover for Dhoni | Sakshi
Sakshi News home page

ధోనీకి గాయం.. పార్థివ్కు పిలుపు

Feb 22 2016 6:19 PM | Updated on Sep 3 2017 6:11 PM

ధోనీకి గాయం.. పార్థివ్కు పిలుపు

ధోనీకి గాయం.. పార్థివ్కు పిలుపు

ఆసియా కప్ ప్రారంభంకాక ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గాయపడ్డాడు.

ఢాకా: ఆసియా కప్ ప్రారంభంకాక ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ధోనీ కండరాలు పట్టివేశాయి. దీంతో భారత క్రికెట్ బోర్డు బ్యాట్స్మన్ కమ్ కీపర్ పార్థివ్ పటేల్ను జట్టులోకి తీసుకుంది. ఢాకా వెళ్లి భారత జట్టులో చేరాల్సిందిగా కబురంపింది.

బంగ్లాదేశ్లో ఆసియా కప్ జరగనున్న సంగతి తెలిసిందే. బుధవారం జరిగే తొలి మ్యాచ్లో భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఈలోగా పార్థివ్ బంగ్లాదేశ్ వెళ్లనున్నాడు. కాగా సుదీర్ఘ విరామం తర్వాత అతనికి భారత జట్టులో చోటు దక్కింది. చివరిసారిగా నాలుగేళ్ల క్రితం శ్రీలంకతో వన్డేలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 20 టెస్టులు, 38 వన్డేలాడిన పార్థివ్ అంతర్జాతీయ టి-20లు మాత్రం రెండే ఆడాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement