ఢిల్లీని గెలిపించిన రాబిన్ సింగ్ | As it happened: Delhi Dynamos vs FC Goa, ISL Semifinal, 1st Leg | Sakshi
Sakshi News home page

ఢిల్లీని గెలిపించిన రాబిన్ సింగ్

Dec 12 2015 12:40 AM | Updated on Sep 3 2017 1:50 PM

ఢిల్లీని గెలిపించిన రాబిన్ సింగ్

ఢిల్లీని గెలిపించిన రాబిన్ సింగ్

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ తొలి అంచె సెమీస్‌లో ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ ఆకట్టుకుంది.

 ఐఎస్‌ఎల్ తొలి అంచె సెమీస్‌లో గోవా ఓటమి
 న్యూఢిల్లీ:
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ తొలి అంచె సెమీస్‌లో ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ ఆకట్టుకుంది. గోవా ఎఫ్‌సీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 1-0తో గెలిచింది. లీగ్ చరిత్రలో గోవా జట్టుపై ఢిల్లీ నెగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇరు జట్ల మధ్య రెండో అంచె సెమీస్ 15న గోవాలో జరుగుతుంది. ఢిల్లీ తరఫున ఏకైక గోల్ రాబిన్ సింగ్ (42వ నిమిషంలో) చేశాడు. లీగ్ దశలో టాపర్‌గా నిలిచిన గోవాపై ఆరంభం నుంచే ఢిల్లీ ఆటగాళ్లు ప్రణాళిక ప్రకారం ఆడారు. గోవా అటాకింగ్ ఆటను అడ్డుకుంటూనే తమ దాడులు తీవ్రం చేశారు. ఫలితంగా 42వ నిమిషంలో అండర్సన్ చికావో పంపిన క్రాస్‌ను రాబిన్ సింగ్ హెడర్ గోల్ చేసి జట్టు శిబిరంలో ఆనందం నింపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement