గోవా చేతిలో కోల్‌కతాకు చుక్కెదురు | FC Goa Go Top of The Table With 2-1 Win over Atletico de Kolkata | Sakshi
Sakshi News home page

గోవా చేతిలో కోల్‌కతాకు చుక్కెదురు

Dec 15 2019 5:42 AM | Updated on Dec 15 2019 5:42 AM

FC Goa Go Top of The Table With 2-1 Win over Atletico de Kolkata - Sakshi

గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ప్రస్తుత సీజన్‌లో నిలకడగా ఆడుతోన్న మాజీ చాంపియన్‌ అట్లెటికో డి కోల్‌కతాకు చుక్కెదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 1–2తో ఎఫ్‌సీ గోవా చేతిలో కంగుతింది. మ్యాచ్‌ మొదటి అర్ధ భాగాన్ని ఇరు జట్లు గోల్స్‌ లేకుండానే ముగించాయి. గోవా తరఫున 60వ నిమిషంలో మౌర్తాడ ఫాల్‌... 66వ నిమిషంలో ఫెరాన్‌ కొరొమినాస్‌ ఒక్కో గోల్‌ చేశారు. 64వ నిమిషంలో కోల్‌కతాకు జాబీ జస్టిన్‌ ఏకైక గోల్‌ అందించాడు. నేడు ముంబైతో బెంగళూరు ఆడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement