హరీందర్‌కు మరో టైటిల్‌ | Another title for Harinder | Sakshi
Sakshi News home page

హరీందర్‌కు మరో టైటిల్‌

Jul 17 2017 4:04 AM | Updated on Sep 5 2017 4:10 PM

హరీందర్‌కు మరో టైటిల్‌

హరీందర్‌కు మరో టైటిల్‌

భారత అగ్రశ్రేణి స్క్వాష్‌ క్రీడాకారుడు హరీందర్‌ పాల్‌ సంధూ తన జోరును కొనసాగిస్తున్నాడు. గత వారమే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను నెగ్గిన హరీందర్‌ తాజాగా విక్టోరియన్‌ ఓపెన్‌ టైటిల్‌నూ

చెన్నై: భారత అగ్రశ్రేణి స్క్వాష్‌ క్రీడాకారుడు హరీందర్‌ పాల్‌ సంధూ తన జోరును కొనసాగిస్తున్నాడు. గత వారమే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను నెగ్గిన హరీందర్‌ తాజాగా విక్టోరియన్‌ ఓపెన్‌ టైటిల్‌నూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్‌ హరీందర్‌ 12–14, 11–3, 11–4, 11–7తో టాప్‌ సీడ్‌ రెక్స్‌ హెడ్రిక్‌ (ఆస్ట్రేలియా)పై సంచలన విజయాన్ని సాధించాడు. 28 ఏళ్ల హరీందర్‌కు ఈ ఏడాదిలో ఇది నాలుగో టైటిల్‌ కావడం విశేషం. ఫైనల్‌కు చేరే క్రమంలో ఒక్క గేమ్‌నూ కూడా కోల్పోని భారత స్టార్‌ తుది పోరును 77 నిమిషాల్లో ముగించాడు.

Advertisement
 
Advertisement
Advertisement