ఐపీఎల్‌: ఆ ఘనత సాధించిన తొలి ఆసీస్‌ క్రికెటర్‌

Andrew Tye Was The First Australian To Win The Purple Cap In The IPL Season - Sakshi

సాక్షి, పుణె : ఐపీఎల్‌ అంటేనే రికార్డులకు కేరాఫ్‌ ఆడ్రస్‌.. హీరోలు జీరోలవుతారు.. అనామక క్రికెటర్లు కింగ్‌లు అయిన సందర్బాలు కోకొల్లలు. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఐపీఎల్‌ ఒక చక్కటి వేదిక అని దేశవిదేశీ ఆటగాళ్లు భావిస్తుంటారు. తాజాగా అంతగా గుర్తింపు పొందని ఆస్ట్రేలియా క్రికెటర్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఆసీస్‌ హేమాహేమీలతో సాధ్యం కానిది 31 ఏళ్ల ఆండ్రూ టై సాధించాడు. తాజా సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌ తరపున ఆడిన టై.. అత్యధిక వికెట్లు తీసి పర్పుల్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్న తొలి ఆసీస్‌ బౌలర్‌గా ఘనత సాధించాడు. 

ఓవరాల్‌గా ఐపీఎల్‌లో  అత్యధిక వికెట్లు తీసిన ఆసీస్‌ బౌలర్ల జాబితాలో ఆండ్రూ టై(24) రెండో స్థానంలో నిలవగా, తొలి స్థానంలో జేమ్స్‌ ఫాల్కనర్‌ (28వికెట్లు, 2013) కోనసాగుతున్నాడు. అయితే ఆ సీజన్‌లో డ్వేన్‌ బ్వేవో 32 వికెట్లు సాధించి ఆగ్రస్థానంలో ఉండటంతో ఫాల్కనర్‌ పర్పుల్‌ క్యాప్‌ను సొంతం చేసుకోలేకపోయాడు. ఈ సీజన్‌లో ఆండ్రూ టై 24 వికెట్లతో అదరగొట్టినప్పటికీ కింగ్స్‌ పంజాబ్‌  ప్లేఆఫ్‌ చేరుకోలేకపోయింది.

ఇంకా చదవండి: ‘టాప్‌’లేపారు.. కానీ!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top