రాణించిన కరీబియన్ బౌలర్లు | Afghanistan set target of 124 runs against west indies | Sakshi
Sakshi News home page

రాణించిన కరీబియన్ బౌలర్లు

Mar 27 2016 4:32 PM | Updated on Sep 3 2017 8:41 PM

రాణించిన కరీబియన్ బౌలర్లు

రాణించిన కరీబియన్ బౌలర్లు

వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా గ్రూప్-1లో వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో అఫ్ఘానిస్తాన్ 124 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

నాగ్పూర్:వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా గ్రూప్-1లో అఫ్ఘానిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండీస్ బౌలర్లు రాణించారు. అఫ్ఘాన్ ను సాధారణ స్కోరుకే కట్టడి చేసిన కరీబియన్లు మరోసారి తమ జోరును ప్రదర్శించారు. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ తీసుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన అఫ్ఘాన్ ఆదిలోనే ఉస్మాన్ ఘని(4) వికెట్ ను నష్టపోయింది. అనంతరం మరో ఓపెనర్ మొహ్మద్ షెహజాద్(24) ఫర్వాలేదనిపించాడు. ఆపై అస్గర్ స్టానిక్ జాయ్(16), గుల్దాబిన్ నైబ్(8),  షెన్వారీ(1)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరడంతో అఫ్ఘాన్ 56 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

 

ఆ తరుణంలో నజిబుల్లా జద్రాన్(48 నాటౌట్. 40 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో అఫ్ఘానిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో శామ్యూల్ బద్రి మూడు వికెట్లు సాధించగా, రస్సెల్ రెండు, బెన్, స్యామీలకు తలో వికెట్ లభించింది.

Advertisement
 
Advertisement
Advertisement