లైంగిక నేరాల్ని అంగీకరించిన ప్రముఖ ఆటగాడు! | Adam Johnson admits grooming and kissing schoolgirl in a sexual manner | Sakshi
Sakshi News home page

లైంగిక నేరాల్ని అంగీకరించిన ప్రముఖ ఆటగాడు!

Feb 10 2016 6:50 PM | Updated on Oct 2 2018 8:39 PM

లైంగిక నేరాల్ని అంగీకరించిన ప్రముఖ ఆటగాడు! - Sakshi

లైంగిక నేరాల్ని అంగీకరించిన ప్రముఖ ఆటగాడు!

ప్రముఖ ఇంగ్లండ్ ఫుట్‌బాల్ ఆటగాడు ఆడం జాన్సన్‌ ఓ 15 ఏళ్ల బాలిక పట్ల లైంగిక నేరాలకు పాల్పడ్డట్టు కోర్టు ముందు అంగీకరించాడు.

ప్రముఖ ఇంగ్లండ్ ఫుట్‌బాల్ ఆటగాడు ఆడం జాన్సన్‌ ఓ 15 ఏళ్ల బాలిక పట్ల లైంగిక నేరాలకు పాల్పడ్డట్టు కోర్టు ముందు అంగీకరించాడు. ఈ మేరకు పోలీసులు నమోదుచేసిన రెండు అభియోగాలను ఒప్పుకొన్నాడు. అయితే తీవ్రమైన లైంగిక దుశ్చర్యలకు పాల్పడినట్టు పోలీసులు మోపిన మరో రెండు అభియోగాలను మాత్రం అతడు తిరస్కరించాడు. లైంగిక ఉద్దేశంతో ఓ పాఠశాల బాలికతో సన్నిహితంగా వ్యవహరించడం, ఆమెను ముద్దాడటం వంటి చర్యలకు పాల్పడ్డానని అతను బుధవారం బ్రాడ్‌ఫర్డ్ క్రోన్‌ కోర్టు ముందు అంగీకరించాడు. ఈ నేరాన్ని అంగీకరించే సమయంలో అతని ప్రియురాలు స్టాసీ ఫ్లౌండర్స్ (26)లో కోర్టులోనే ఉంది.

పాఠశాల బాలికలతో లైంగికంగా దుశ్చర్యలకు పాల్పడాడ్డన్న ఆరోపణలపై గత ఏడాది మార్చిలో ఆడం జాన్సన్ అరెస్టయ్యాడు. అతని గర్ల్‌ఫ్రెండ్‌ స్టాసీ గర్భవతిగా ఉన్న సమయంలో జాన్సన్ ఓ టీనేజ్ బాలికపై లైంగిక నేరాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఎన్నోసార్లు ఇంగ్లండ్‌ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు, ప్రీమియర్ లీగ్‌లో సుందర్‌ల్యాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన  జాన్సన్‌కు ప్రస్తుతం తొమ్మిది నెలల బిడ్డ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement