breaking news
Adam Johnson
-
'నేను చాలా పెద్ద తప్పు చేశాను'
లండన్: జీవితంలో తాను చాలా పెద్ద తప్పు చేశానని వాపోతున్నాడు ఇంగ్లండ్ ఫుట్‌బాలర్ ఆడం జాన్సన్. లైంగిక వేధింపుల కేసులో పీకల్లోతు మునిగిపోయిన ఈ వికృత ఆటగాడు తాను చేసిన తప్పులను తొలిసారి బహిరంగంగా అంగీకరించాడు. అయితే తన లైంగిక అకృత్యాల కారణంగా జైలుపాలు అవుతానని తాను ఎప్పుడూ భావించలేదని చెప్పుకొచ్చాడు. సండర్లాండ్ జట్టుతోపాటు ఇంగ్లండ్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ స్టార్ ఆటగాడు మైనర్ బాలికతో లైంగిక చర్యలకు పాల్పడిన కేసులో దోషిగా తేలాడు. ఈ కేసులో త్వరలో శిక్ష ఎదుర్కొనున్న జాన్సన్ ఊహించనిరీతిలో తన జీవితం పతనమైందని, ఇంక తానెప్పుడు ఫుట్‌బాల్ ఆడకపోవచ్చునని ఆవేదన వ్యక్త పరిచాడు. తన జైలుశిక్ష సాధ్యమైనంత తొందరగా పూర్తయితే తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్పుకొచ్చాడు. 'ఇది నా స్వయంకృతాపరాధమే. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇదంతా గతమైపోవాలని ఆశిస్తున్నారు. ఈ గతం గురించి కాకుండా వేరేవాటి గురించి ఆలోచిస్తున్నాను. నా తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను' అని డానిష్ వ్యాపారవేత్త, మోడల్ జూలీ హల్‌తో మాట్లాడుతూ చెప్పాడు. మైనర్ బాలికల పట్ల అసభ్యమైన శృంగార చేష్టలకు పాల్పడి దుర్మార్గంగా వ్యవహరించిన జాన్సన్‌ను ఇప్పటికే అతని ప్రియురాలు వదిలేసింది. తామిద్దరికి పుట్టిన 13 నెలల బిడ్డను తీసుకొని స్టాసీ ఫ్లౌండర్ జాన్సన్ నుంచి వేరయింది. లైంగిక నేరాల కేసు విచారణ సందర్భంగా ఆద్యంత జాన్సన్ కు అండగా నిలబడిన ఫ్లౌండర్.. అతడు వెల్లడించిన దారుణ నిజాలతో తమ బంధానికి గుడ్‌బై చెప్పింది. -
లైంగిక నేరాల్ని అంగీకరించిన ప్రముఖ ఆటగాడు!
ప్రముఖ ఇంగ్లండ్ ఫుట్‌బాల్ ఆటగాడు ఆడం జాన్సన్ ఓ 15 ఏళ్ల బాలిక పట్ల లైంగిక నేరాలకు పాల్పడ్డట్టు కోర్టు ముందు అంగీకరించాడు. ఈ మేరకు పోలీసులు నమోదుచేసిన రెండు అభియోగాలను ఒప్పుకొన్నాడు. అయితే తీవ్రమైన లైంగిక దుశ్చర్యలకు పాల్పడినట్టు పోలీసులు మోపిన మరో రెండు అభియోగాలను మాత్రం అతడు తిరస్కరించాడు. లైంగిక ఉద్దేశంతో ఓ పాఠశాల బాలికతో సన్నిహితంగా వ్యవహరించడం, ఆమెను ముద్దాడటం వంటి చర్యలకు పాల్పడ్డానని అతను బుధవారం బ్రాడ్ఫర్డ్ క్రోన్ కోర్టు ముందు అంగీకరించాడు. ఈ నేరాన్ని అంగీకరించే సమయంలో అతని ప్రియురాలు స్టాసీ ఫ్లౌండర్స్ (26)లో కోర్టులోనే ఉంది. పాఠశాల బాలికలతో లైంగికంగా దుశ్చర్యలకు పాల్పడాడ్డన్న ఆరోపణలపై గత ఏడాది మార్చిలో ఆడం జాన్సన్ అరెస్టయ్యాడు. అతని గర్ల్‌ఫ్రెండ్ స్టాసీ గర్భవతిగా ఉన్న సమయంలో జాన్సన్ ఓ టీనేజ్ బాలికపై లైంగిక నేరాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఎన్నోసార్లు ఇంగ్లండ్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు, ప్రీమియర్ లీగ్‌లో సుందర్‌ల్యాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జాన్సన్‌కు ప్రస్తుతం తొమ్మిది నెలల బిడ్డ ఉంది.