అబ్దుల్లా సంచలన విజయం | abdulla gets sensational victory | Sakshi
Sakshi News home page

అబ్దుల్లా సంచలన విజయం

Apr 1 2017 11:12 AM | Updated on Sep 5 2017 7:41 AM

అబ్దుల్లా సంచలన విజయం

అబ్దుల్లా సంచలన విజయం

ఆలిండియా ర్యాంకింగ్‌ పురుషుల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ ప్లేయర్‌ షేక్‌ అబ్దుల్లా సంచలన విజయం నమోదు చేశాడు.

ముంబై: ఆలిండియా ర్యాంకింగ్‌ పురుషుల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ ప్లేయర్‌ షేక్‌ అబ్దుల్లా సంచలన విజయం నమోదు చేశాడు. శుక్రవారం జరిగిన సింగిల్స్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో అన్‌సీడెడ్‌ అబ్దుల్లా (తెలంగాణ) 6–2, 6–3తో కునాల్‌ ఆనంద్‌ (ఢిల్లీ)ని కంగుతినిపించాడు. గతేడాది ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ఆనంద్‌ను 90 నిమిషాల్లోనే మట్టికరిపించి తుదిపోరుకు అర్హత సాధించాడు.

మరో మ్యాచ్‌లో ఆరోసీడ్‌ జతిన్‌ దహియా (ఢిల్లీ) 4–6, 6–1, 6–4తో రెండో సీడ్‌ నితిన్‌ కీర్తనే (మహారాష్ట్ర)కు షాకిచ్చి ఫైనల్‌కు చేరుకున్నాడు. డబుల్స్‌ విభాగంలో కునాల్‌ ఆనంద్‌–ఆదిత్య తివారి ద్వయం 7–5, 6–1తో సాయి శరణ్‌ రెడ్డి–ఎస్‌డీ ప్రజ్వల్‌ దేవ్‌ జంటపై, ద్రువ్‌ సునీశ్‌–పరమేశ్వర్‌ ద్వయం 1–6, 7–5, 10–8తో భవేశ్‌ సింగ్‌ గౌర్‌–అన్విత్‌ బెంద్రే జంటపై గెలుపొందాయి.

 

Advertisement

పోల్

Advertisement