ఫించ్‌ పిచ్చకొట్టుడు! | Aaron Finch Sets Surrey Record With T20 Ton | Sakshi
Sakshi News home page

Jul 14 2018 11:42 AM | Updated on Jul 14 2018 3:47 PM

Aaron Finch Sets Surrey Record With T20 Ton - Sakshi

ఆరోన్‌ ఫించ్‌

లండన్‌ : ఇంగ్లండ్‌ గడ్డపై ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ రెచ్చిపోయాడు. ఒక పరుగు వద్ద లభించిన లైఫ్‌తో విధ్వంసం సృష్టించాడు. 79 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 131 పరుగులు బాది రికార్డు సృష్టించాడు. ఇంగ్లీష్‌ బ్లాస్ట్‌ టీ20 టోర్నీలో భాగంగా సర్రే జట్టు తరపున బరిలోకి దిగిన ఫించ్‌.. సస్సెక్స్‌ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో సర్రే జట్టు 52 పరుగుల తేడాతో సస్సెక్స్‌పై విజయం సాధించింది. ఫించ్‌ తొలి పరుగు వద్దనే జోఫ్రా ఆర్చర్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇవ్వగా.. అతను నేలపాలు చేశాడు.

ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకున్న ఫించ్‌ సెంచరీతో చెలరేగాడు. ఇది సర్రె జట్టు బ్యాట్స్‌మన్‌గా అత్యధిక స్కోర్‌ కాగా.. ఫించ్‌కు టీ20ల్లో ఐదో టీ20 సెంచరీ. దీంతో సర్రే జట్టు మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్య చేధనలో సస్సెక్స్‌ జట్టు తడబడింది. 18వ ఓవర్లోనే 140 పరుగుల వద్ద చాపచుట్టేసింది. ఇక వరల్డ్‌ నెం1 బౌలర్‌ అఫ్గాన్‌ సంచలనం రషీద్‌ఖాన్‌ బౌలింగ్‌ను సైతం ఫించ్‌ చీల్చిచిండాడడు. ఈ దెబ్బకు రషీద్‌ 40 పరుగులు సమర్పించుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement