నవాబ్ షుజాత్ అహ్మద్ ఖాన్ స్మారక బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను ఆంధ్ర విద్యాలయం (ఏవీ) కాలేజి జట్టు చేజిక్కించుకుంది.
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: నవాబ్ షుజాత్ అహ్మద్ ఖాన్ స్మారక బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను ఆంధ్ర విద్యాలయం (ఏవీ) కాలేజి జట్టు చేజిక్కించుకుంది. సిటీ కాలేజి ఓల్డ్ బాయ్స్ క్లబ్ ఆధ్వర్యంలో సిటీ గవర్నమెంట్ కాలేజి బాస్కెట్‌బాల్ కోర్టులో మంగళవారం జరిగిన ఫైనల్లో ఏవీ కాలేజి జట్టు 103-95 పాయింట్ల తేడాతో లయోలా అకాడమీ జట్టుపై ఘన విజయం సాధించింది.
ప్రధమార్ధభాగం ముగిసే సమయానికి ఏవీ కాలేజి జట్టు 45-43 పాయింట్లతో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. ఏవీ కాలేజి జట్టులో సాయి కృష్ణ దూకుడుగా ఆడి అత్యధికంగా 27 పాయింట్లను నమోదు చేయగా, విజయ్ 20, శామ్సన్ 15 పాయింట్లు స్కోరు చేశారు. లయోలా అకాడమీ జట్టులో గణేష్ 24, ఉదయ్ 23, చంద్రహాసన్ 11 పాయింట్లతో రాణించినప్పటికీ ఫలితం లేకపోయింది.