‘ఎ’ జట్ల రెండో టెస్టు ‘డ్రా’ | A' team in the second Test, 'draw' | Sakshi
Sakshi News home page

‘ఎ’ జట్ల రెండో టెస్టు ‘డ్రా’

Sep 6 2013 1:45 AM | Updated on Oct 17 2018 4:43 PM

‘ఎ’ జట్ల రెండో టెస్టు ‘డ్రా’ - Sakshi

‘ఎ’ జట్ల రెండో టెస్టు ‘డ్రా’

భారత్ ‘ఎ’, న్యూజిలాండ్ ‘ఎ’ జట్ల మధ్య జరిగిన రెండో అనధికార టెస్టు మ్యాచ్ ‘డ్రా’ అయ్యింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఎలాంటి ఫలితం తేలకుండానే ముగిసింది.

సాక్షి, విశాఖపట్నం: భారత్ ‘ఎ’, న్యూజిలాండ్ ‘ఎ’ జట్ల మధ్య జరిగిన రెండో అనధికార టెస్టు మ్యాచ్ ‘డ్రా’ అయ్యింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఎలాంటి ఫలితం తేలకుండానే  ముగిసింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... గురువారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి  51.2 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసింది.
 
  డి బోర్డర్ (11 నాటౌట్), కొరి జే అండర్సన్ (26 నాటౌట్) క్రీజులో ఉన్నారు. లాథమ్ (61), కార్ల్ కచోపా (76) వేగంగా ఆడారు. మొత్తానికి ఈ మ్యాచ్ ద్వారా కివీస్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌కు బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. రాకేశ్ ధ్రువ్ 2, ధావల్ కులకర్ణీ ఒక్క వికెట్ తీశారు.
 
 అంతకుముందు 408/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 135.3 ఓవర్లలో 430 పరుగులకు ఆలౌటైంది. మన్‌ప్రీత్ జునేజా (362 బంతుల్లో 193; 20 ఫోర్లు, 1 సిక్సర్) డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. లోయర్ ఆర్డర్‌లో ఎవరు పెద్దగా రాణించలేదు. ఉదయం లభించిన 22 పరుగుల్లో జునేజానే 15 పరుగులు చేశాడు. చివరకు మార్క్ గిలెస్సీ బౌలింగ్‌లో అండర్సన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కివీస్ బౌలర్లలో గిలెస్సీ 4, బ్రాస్‌వెల్ 3, ఆస్టలే 2 వికెట్లు తీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement