ఓడిపోతే సరదా ఏమిటి..?; భార్యకు స్మిత్‌ రిప్లై |  I Have No Fun, Steve Smith Replies To Wife Dani | Sakshi
Sakshi News home page

ఓడిపోతే సరదా ఏమిటి..?; భార్యకు స్మిత్‌ రిప్లై

Apr 24 2020 12:11 PM | Updated on Apr 24 2020 12:15 PM

 I Have No Fun, Steve Smith Replies To Wife Dani - Sakshi

సిడ్నీ:  కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌తో ఎక్కడ కూడా మ్యాచ్‌లు లేకపోవడంతో క్రికెటర్లు తెగ బోర్‌ ఫీలవుతున్నారు. ఇదెక్కడి కరోనా వైరస్‌రా నాయనా అనుకోవడం తప్పితే మరొకటి చేసేదేమీ లేకపోయింది. బాగా బోర్‌ ఫీలయితే ఇంట్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేసేస్తున్నారు క్రికెటర్లు. ఇలా ఐసోలేషన్‌ బ్యాటింగ్‌ చేసిన స్టీవ్‌ స్మిత్‌.. బోర్‌ కొడుతుందని రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. ఆపై బంతిని వాల్‌కు కొడుతూ క్యాచ్‌ అందుకుంటూ ఉన్న వీడియోను కూడా స్మిత్‌ షేర్‌ చేశాడు. అయితే తాజాగా స్మిత్‌-అతని భార్మ డానీ విల్లిస్‌లు ఒక వీడియో గేమ్‌ ఆడారు. (నేరుగా ధోని వద్దకు పో..!)

మారియో కార్ట్‌ వీడియో గేమ్‌ను భార్యాభర్తలు ఇరువురూ ఆడగా అందులో డానీ గెలిచారు. దాంతో స్మిత్‌కు నిరాశ తప్పలేదు. మనోడు క్రికెట్‌లో ఓటములు ఎదురైనప్పుడు కూడా ఎక్కువగా అప్‌సెట్‌ అవుతూ ఉంటాడు. మరి అప్పుడు ఊరడించడానికి భార్య ఉంటుంది కాబట్టి ఫర్వాలేదు. మరి ఇక్కడ భార్య చేతిలోనే ఓడిపోవడాన్ని సరదాగా తీసుకోకుండా కాస్త చిరాకుగా ముఖం పెడితే ఎలా ఉంటుంది. బాగోదు కదా.. ఇప్పుడు స్మిత్‌ విషయంలో కూడా అదే జరిగింది. ‘ వీడియో గేమ్‌లో ఫన్‌ను ఆస్వాదించావా స్మిత్‌’ అని డానీ అడగ్గా, ‘ లేదు’ అంటూ స్మిత్‌ సమాధానం చెప్పాడు. ‘ ఎందుకు బాస్‌’ అని డానీ మళ్లీ అడగగా, ‘ ఓడిపోతే సరదా ఏమిటి’ అంటూ స్మిత్‌ ముఖం ముడుచుకుని మరీ సమాధానం వచ్చాడు.మరి ఈ విషయంలో  డానీ ఏం చేసిందో..స్మిత్‌ అలకను తీర్చిందో లేదో పాపం. (‘జట్టుగా చేసిన పాపాన్ని స్మిత్‌ భరించాడు’)

కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్‌ నిరవధిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌-13వ సీజన్‌ ఇప్పటికే ఆరంభం కావాల్సి ఉండగా ‘ ఏ నిమిషానికో ఏమి జరుగునో’ అన్న చందంగా వాయిదా పడింది. ఎవరూ ఊహించని ఈ పరిణామానికి అటు బీసీసీఐ, ఇటు ఫ్రాంఛైజీలు వేల కోట్ల రూపాయిలు నష్టపోతున్నాయి. ఇక బ్రాడ్‌కాస్టర్స్‌ సంగతి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సీజన్‌లో తిరిగి రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకోవాలని అనుకున్న స్మిత్‌కు అది తీరేలా కనుబడటం లేదు. ఈ లీగ్‌పై ఎటువంటి స్పష్టత లేకపోవడంతో క్రీడాకారులు మాత్రం జరుగుతుందనే ధీమాలో ఉన్నారు. అందులో స్మిత్‌ ఒకడు. ఆసీస్‌కు తిరిగి సారథి కావాలనుకుంటున్న స్మిత్‌..ఐపీఎల్‌లో నాయకుడిగా మళ్లీ సక్సెస్‌ బాట పడితే సీఏ దృష్టిని ఆకర్షించి కెప్టెన్సీ రేసులోకి వచ్చేయచ్చు. బాల్‌ ట్యాంపరింగ్‌ కారణంగా కెప్టెన్సీ పొగొట్టుకున్న స్మిత్‌ మళ్లీ కెప్టెన్‌ కావాలనుకునే కల ఎప్పటికీ తీరుతుందో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement