
విశాల్
టీ.నగర్: తలనొప్పి, కీళ్లనొప్పులతో బాధపడుతున్న నటుడు విశాల్ చికిత్సల కోసం అమెరికా ఆస్పత్రిలో చేరారు. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, నిర్మాతల సంఘం అధ్యక్షుడైన విశాల్ ప్రస్తుతం ఇరుంబుతిరై, సండైకోళి–2 చిత్రాల్లో నటిస్తున్నారు. ఈయన గత కొం తకాలంగా తలనొప్పితో బాధపడుతూ వచ్చారు.
అవన్ ఇవన్ చిత్రంలో నటించినప్పటి నుంచి తలనొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. తుప్పరివాలన్ చిత్రంలో నటిస్తుండగా ఒక ఫైట్ సన్నివేశంలో భుజానికి గాయం ఏర్పడింది. దీంతో తలనొప్పి అధికమైంది. ఈ నేపథ్యంలో గత వారం ఢిల్లీ ప్రైవేటు ఆస్పత్రిలో ఫిజి యోథెరపీ చికిత్సలు అందుకున్నారు. అయినప్పటికీ కీళ్లనొప్పులు పోకపోవడంతో విశాల్ అమెరికా వెళ్లారు. అక్కడున్న ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారు. 10రోజుల్లో ఆయన చెన్నై తిరిగి వస్తారని సమాచారం.