సింహం సింగిల్‌గా రాదు.. మీరే చూడండి | Sudha Ramen Shares Video Group Of Lions Drink Water Together | Sakshi
Sakshi News home page

సింహం సింగిల్‌గా రాదు.. మీరే చూడండి

May 26 2020 9:32 PM | Updated on May 26 2020 9:43 PM

Sudha Ramen Shares Video Group Of Lions Drink Water Together - Sakshi

సింహం సింగిల్‌గానే వస్తుంది' ఇది మన తెలుగు సినిమా డైలాగ్‌.. కానీ దీనికి భిన్నంగా ఓ చోట

‘నాన్నా పందులే గుంపులుగా వస్తాయ్‌.. సింహం సింగిల్‌గానే వస్తుంది' ఇది మన తెలుగు సినిమా డైలాగ్‌.. కానీ దీనికి భిన్నంగా ఓ చోట నీళ్లు తాగడానికి సింహాలు గుంపుగానే వచ్చాయి. అత్యంత అరుదైన, అద్భుతమైన ఈ దృశ్యం ఆఫ్రికా అడవుల్లోనిది. ఈ వీడియో పాతదే అయినా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుధారామన్‌ ఈ వీడియోను తాజాగా ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఆఫ్రికాకు చెందిన లండొలోజి ఈ వీడియోను మొదట షేర్‌ చేసినట్లు సుధా తెలిపారు. 'టైగర్‌ ఫ్యామిలీ డ్రింక్‌ టుగెదర్‌.. స్టే టుగెదర్‌' అంటూ క్యాప్షన్‌ పెట్టారు. ఇక వీడియో చివరలో లయన్‌ కింగ్‌ సినిమాటిక్‌ ఎంట్రీ అబ్బుర పరుస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement