ఒక్కసారి హారన్‌ కొడతా...ప్లీజ్‌ | The Horn Challenge is The Hot Trend Topping The TikTok | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌లో కొత్తగా ‘హారన్‌ చాలెంజ్‌’

Jun 25 2019 7:47 PM | Updated on Jun 25 2019 8:51 PM

The Horn Challenge is The Hot Trend Topping The TikTok - Sakshi

అన్ని యాప్‌ల యందు టిక్‌టాక్‌ వేరయా..! అంటున్నారు టిక్‌టాక్‌ యూజర్లు. ప్రతీవారం ఏదో ఒక చాలెంజ్‌తో ట్రెండింగ్‌గా నిలిచే టిక్‌టాక్‌ ఈ వారం హారన్‌ చాలెంజ్‌తో ముందుకొచ్చింది. ఇంకేముంది, ఎవరికి నచ్చినట్టుగా వారు వారిదైన స్టైల్లో వీడియోలు తీసుకుంటూ హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా షేర్‌ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు పాటకు తగ్గట్టుగా లిప్‌ మూమెంట్‌ ఉండి అందుకు తగ్గట్టుగా నటన ఉన్నప్పుడే అది వైరల్‌ అవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ హారన్‌ చాలెంజ్‌కు అవేవీ అవసరం లేదు. పైగా తక్కువ నిడివి ఉండటంతో సులువుగా చేసే అవకాశం ఉంది. చేసిన వీడియోలను షేర్‌ చేసుకునే అవకాశం ఉండటంతో జనాలు టిక్‌టాక్‌ మాయలో ఉన్నారు.

ప్రస్తుతం హారన్‌ చాలెంజ్‌ టిక్‌టాక్‌ యూజర్స్‌ దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇందులో అంతా నిశ్శబ్ధంగా ఉండి ఒక్కసారిగా బస్‌ హారన్‌ శబ్దం మాత్రమే వినపడుతుంది. బస్ హారన్‌ ఎలా కొడతారో ఎదుటివారి మొహాన్ని కూడా అదే విధంగా ప్రెస్‌ చేస్తారు. దీంతో అందరూ ఒక్కసారిగా‍ ఘొల్లుమని నవ్వుతారు. ఎవరిని మొహాన్నైతే హారన్‌లా ప్రెస్‌​ చేస్తారో వారి ముఖంలో చిత్రవిచిత్రాలుగా హావభావాలు ఒకేసారి కనిపిస్తాయి. ఇది మరింత హాస్యానికి కారణమవుతుంది.

ఇలా ఎప్పుడూ ఏదో ఒక చాలెంజ్‌ ఇస్తుంటే.. టిక్‌ టాక్‌ యూజర్లు ఊరికే ఊరుకుంటారా! ప్రతీ చాలెంజ్‌కు వీడియోలు చేస్తూ హ్యాష్‌ట్యాగ్‌తో షేర్‌ చేసుకుంటున్నారు. గతవారం నూడుల్‌ డ్యాన్స్‌, గడ్డం చాలెంజ్‌తో ఊదరగొట్టగా నేడు ఫన్నీగా ఉండే ‘హారన్‌ చాలెంజ్‌’ హాట్‌ ట్రెండ్‌గా నిలిచింది. చాలామంది యూజర్లు వాటికి అంతే ఫన్నీగా వీడియోలు చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement