వైరల్‌ : సీఎస్‌కే అభిమాని వినూత్న ప్రయోగం

CSK Fan Print His Wedding Card Like CSK Ticket Model - Sakshi

చెన్నై : మన దేశంలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజే వేరు. క్రికెట్‌ అభిమానులంతా ఐపీఎల్‌ కోసం ఏడాది పొడవునా నిరీక్షిస్తుంటారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు, టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీఎస్‌కే, ధోని మీద ఉన్న అభిమానాన్ని ప్రదర్శించుకోవడానికి ఓ అభిమాని చేసిన వినూత్న ప్రయోగం క్రికెట్‌ ప్రియులనే కాక నెటిజన్లను కూడా విపరీతంగా ఆకర్షిస్తోంది.

వివరాలు.. కె. వినోద్‌ అనే వ్యక్తికి సీఎస్‌కే జట్టుకి, ధోనికి వీరాభిమాని. తన అభిమానాన్ని ప్రదిర్శించుకోవడానికి వినోద్‌ తన వివాహ వేడుకనే అవకాశంగా మలచుకున్నాడు. ఈ ఆలోచనను గ్రాఫిక్‌ డిజైనర్‌ అయిన తన స్నేహితుడితో పంచుకున్నాడు. దీంతో ఇద్దరూ కలిసి బాగా ఆలోచించి పెళ్లి కార్డును సీఎస్‌కే టికెట్‌ మోడల్‌లో ప్రింట్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా వినోద్‌ ‘చెన్నై సూపర్‌ కింగ్‌’గా తన పేరును, ‘చెన్నై సూపర్‌ క్వీన్‌’గా తన కాబోయే భార్య సాధన పేరును రాయించాడు. వివాహ సమయం, వేదిక గురించి మ్యాచ్‌ 2018 సెప్టెంబరు 12 బుధవారం అని కార్డులో ప్రింట్‌ చేయించాడు.

సోషల్‌ మీడయాలో వైరల్‌గా మారిన ఈ కార్డు సీఎస్‌కే జట్టు అధికారులకు దృష్టికి వచ్చింది. దాంతో వారు వినోద్‌ పెళ్లి పత్రికతో పాటు అతని పెళ్లి ఫోటోను కూడా తమ అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేయడమే కాక అతనికి శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ విషయం గురించి వినోద్‌ ‘2015 ఐపీఎల్‌ సందర్భంగా సీఎస్‌కే అధికారులు నాకు ఒక సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. చివరి రోజున వారు నన్ను ఆహ్వానించడమే కాక ధోని సంతకం చేసిన బ్యాట్‌ను నాకు బహుకరించారు’ అంటూ గుర్తు చేసుకున్నాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top