
సాక్షి, ఒంగోలు : ప్రజాసంకల్పయాత్ర 105రోజు ప్రారంభమైంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం తక్కెళ్లపాడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి జె.వంగులూరు, అరికట్లవారిపాలెం, గంగవరంలో ఆయన ప్రజలతో మమేకం అవుతారు. ఇంకొల్లులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. ఇప్పటివరకూ ఆయన 1,414.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.