రాష్ట్రంలో అవినీతి తాండవిస్తోంది | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అవినీతి తాండవిస్తోంది

Published Wed, Mar 6 2019 11:20 AM

Corruption Increased In TDP Government - Madhishetti - Sakshi

సాక్షి, దొనకొండ: రాష్ట్రంలో అభివృద్ధి కంటే అవినీతే అధికంగా తాండవిస్తోందని వైఎస్సార్‌సీపీ దర్శి నియోజకవర్గ సమన్వయకర్త మద్దిశెట్టి వేణుగోపాల్‌ విమర్శించారు. మండలంలోని సంగాపురం, వీరేపల్లి గ్రామాల్లో పార్టీ మండల కన్వీనర్‌ కాకర్ల క్రిష్ణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గొంగటి శ్రీకాంత్‌రెడ్డితో కలిసి మంగళవారం రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని వీధుల్లో ఆయనకు ఆడపడుచులు అడుగడుగునా పూలమాలలతో స్వాగతం పలుకుతూ విజయ తిలకం దిద్దారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు తామంతా కట్టుబడి ఉన్నామని, దానిలో భాగంగా నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకుంటామని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మద్దిశెట్టి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవినీతి ఎక్కువైందని, టీడీపీ పాలకులు అభివృద్ధి మరిచి గొప్పలు చెప్పుకునేందుకే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. రానున్న ఎన్నికల్లో కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. గ్రామాల్లోని సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అన్ని వర్గాలను కలుపుకునిపోతామని స్పష్టం చేశారు.

తాగునీరు కరువైంది : మహిళల ఆవేదన

తమ గ్రామానికి తాగునీరు కరువైందని, గుక్కెడు నీరు అందక అల్లాడుతున్నామని సంగాపురం మహిళలు మద్దిశెట్టి ముందు గగ్గోలు పెట్టారు. స్పందించిన మద్దిశెట్టి.. నీటి సమస్య పరిష్కరించేందుకు ట్యాంకర్‌తో నీటి సరఫరా చేయిస్తామన్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే, సమస్యను శాశ్వితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

గ్రామంలో భూ సమస్య ఎక్కువగా ఉంది...

సంగాపురం గ్రామంలో భూ సమస్య ఎక్కువ ఉందని, టీడీపీ ప్రభుత్వంలో తమను పట్టించుకునే నాథుడు కరువయ్యాడని, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నోస్లారు విన్నవించినా పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రాగానే గ్రామంలో భూ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని మద్దిశెట్టి హామీ ఇచ్చారు.

15 కుటుంబాలు వైఎస్సార్‌ సీపీలో చేరిక...

వీరేపల్లి గ్రామంలో టీడీపీ నుంచి 15 కుటుంబాలు వైఎస్సార్‌ సీపీలో చేరాయి. మద్దిశెట్టి వేణుగోపాల్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో తమకు అన్యాయం జరగడంతో వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఆయా కార్యక్రమాలలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వల్లపునేని వీరయ్యచౌదరి, ఎంపీటీసీ సభ్యులు షేక్‌ గఫార్, విప్పర్ల సుబ్బయ్య, మాజీ సర్పంచులు కర్నాటి ఆంజనేయరెడ్డి, పాతకోట కోటిరెడ్డి, దేవేండ్ల వెంకట సుబ్బయ్య, మాచనూరి బాబు, జిల్లా ఎస్సీ సెల్‌ కార్యదర్శి గుంటు పోలయ్య, జిల్లా ఎస్సీ సెల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ చీరాల ఇశ్రాయేలు, జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ జొన్నకూటి సుబ్బారెడ్డి, జిల్లా యూత్‌ కార్యదర్శి నూనె వెంకటరెడ్డి, వి.కోటేశ్వరరావు, భద్రయ్య, చిన్న వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ సెల్‌ కార్యదర్శి బత్తుల వెంకట సుబ్బయ్య, జిల్లా పబ్లిసిటీ ప్రధాన కార్యదర్శి పత్తికొండ వెంకటసుబ్బయ్య, జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి గుండాల నాగేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్సీ సెల్‌ సంయుక్త కార్యదర్శి కొంగలేటి మోషె, వెన్నపూస చెంచిరెడ్డి, గుడిపాటి నాసరయ్య, మైనార్టీ సెల్‌ మండల అధ్యక్షుడు సయ్యద్‌ యూనుస్, తమ్మనేని యోగిరెడ్డి, ప్రచార విభాగం మండల అధ్యక్షుడు గొంగటి పోలిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement