ప్రకాశం: ఓటర్‌ లిస్టుంది సరే.. మరి మీ పేరుందా? | Check Your Name In Voter List In Prakasam | Sakshi
Sakshi News home page

ప్రకాశం: ఓటర్‌ లిస్టుంది సరే.. మరి మీ పేరుందా?

Mar 10 2019 10:19 AM | Updated on Mar 10 2019 12:55 PM

Check Your Name In Voter List - Sakshi

♦ నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ (www.nvsp.in) ఓపెన్‌ చేసి అందులో పేరు కానీ, ఓటర్‌ ఐడీ కార్డు ఎపిక్‌ నంబర్‌ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు.

♦ 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

♦ www.ceoandhra.nic.in  వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే search your name పేరుతో ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.

♦ జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్నికల ప్రత్యేక సెల్‌లో ఓటరు కార్డు ఎపిక్‌ నంబర్‌ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. 

♦ మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్‌ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు.

♦ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు.

♦ సాధారణంగా ఎన్నికల నామినేషన్‌కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు.

► మీ మీ మండలాల తహసీల్దార్‌ కార్యాలయంలో ఉండే కింది నంబర్లకు చెందిన అధికారులకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

కనిగిరి - నాసిరుద్దిన్, ఎలక్షన్‌ డీటీ - 97049 98500

కనిగిరి - కె.రాజ్‌కుమార్, తహసీల్దార్ - 88866 16059

పామూరు - ఆర్‌.వాసుదేవరావు, డిప్యూటీ తహసీల్దార్ - 88866 16069

వెలిగండ్ల - టి.కోటేశ్వరరావు, తహసీల్దార్ - 88866 16082

పీసీపల్లి - సత్యనారాయణ ప్రసాద్, తహసీల్దార్ - 88866 16068

సీఎస్‌పురం - జి.శ్రీనివాసులు, తహసీల్దార్ - 88866 16049

హెచ్‌ఎంపాడు - ఎస్‌.రామలింగేశ్వరరావు,తహసీల్దార్ - 88866 16056 

- ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement