సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో రైతాంగం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం విదేశాల్లో తిరుగుతూ ఊహల్లో విహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్‌బాబు విమర్శించారు. అతివృష్టి, అనావృష్టిల కారణంగా లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయని, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
అయ్యన్న, డొక్కాలకు హెచ్చరిక : రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా మంత్రులు, టీడీపీ నేతలు కేవలం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని సుధాకర్‌బాబు మండిపడ్డారు. ప్రతిపక్షనేతను అడ్డగోలుగా విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని, అయ్యన్నపాత్రుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్‌లు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.