‘టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది’ | YSRCP Spokes Person John Wesley Fires On TDP In Visakhapatnam | Sakshi
Sakshi News home page

‘టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది’

Sep 10 2019 1:35 PM | Updated on Sep 10 2019 2:00 PM

YSRCP Spokes Person John Wesley Fires On TDP In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్టణం : ఉనికి కోసం టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి జాన్‌ వెస్లీ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై ప్రజల్లో వస్తున్న స్పందన చూసి టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ప్రజాదారణ కోల్పోయామనే భావనతోనే వైఎస్సార్‌సీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు అధికార వ్యవస్థను దుర్వినియోగం చేసిందని దుయ్యబట్టారు.

అయిదేళ్లలో అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన ఘనత చంద్రబాబుదేనని, గత ఎన్నికల్లో ప్రజల్లు ఓట్లతో గడ్డిపెట్టిన టీడీపీకి బుద్ది రాలేదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని, ఇప్పటికైనా టీడీపీ నాయకులు దిగజారుడు ఆరోపణలు మానుకొని సంక్షేమ పాలనలో నిర్ణయాత్మక పాత్ర పోషించాలని జాన్‌ వెస్లీ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement