
జనాభా అర్జంటుగా పెంచాలంట. లేకపోతే చైనా, జపాన్లలాగా
సాక్షి, హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వరుస ట్వీట్లలో పలు ప్రశ్నలు సంధిస్తూ నిలదీశారు. కామెడీ కితకితలు ఆపండి బాబూ అంటూ.. ‘కిందటి సారి సీఎంగా ఉన్నపుడు జనాభా తగ్గించాలని చిటికేస్తే జననాల రేటు భారీగా తగ్గిపోయిందట. ఇప్పుడు జనాభా అర్జంటుగా పెంచాలంట. లేకపోతే చైనా, జపాన్లలాగా జనాభా క్షీణించే ప్రమాదముందని చంద్రం సారు భయపెడుతున్నాడు. ఏమిటీ అర్థం లేని పిచ్చి మాటలు?’ అంటూ సెటైరిక్‌గా ట్వీట్ చేశారు.
మరో ట్వీట్‌లో చంద్రబాబు నుంచి ఏపీ ప్రజలు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు తన హయాంలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసిండో చెప్పాలని, ఆయన నిర్వహించే సభలకు డబ్బు ఎక్కడిదని, పన్నుకట్టే ప్రజలదా? లేక స్కామ్‌ల్లో సంపాదించిందా? అనే విషయాలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని అడుగుతున్నారని ట్వీట్ చేశారు. ఇక చంద్రబాబు దుబార ఖర్చులో సగం రాష్ట ప్రజల సంక్షేమానికి ఖర్చు చేసిన బాగుండేదని అభిప్రాయపడ్డారు.