మండలిని రాజకీయ వేదికగా వాడుకుంటున్నారు

YSRCP MLA Parthasarathy Fires On Chandarababu - Sakshi

చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ధ్వజం

సాక్షి, అమరావతి: ఎన్టీఆర్‌ హయాంలోనే పరిపాలన వికేంద్రీకరణ జరిగిందని.. సమితి వ్యవస్థల నుంచి మండల వ్యవస్థలు తీసుకొచ్చారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలిని టీడీపీ నేతలు రాజకీయ వేదికగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన బిల్లులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాజధాని పేరుతో రైతులను చంద్రబాబు నిలువునా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజల ఆమోదంతో ఎప్పుడు గెలవలేదన్నారు. మండలిని కించపరిచిన చరిత్ర ఆయనదని విమర్శించారు. మండలి రద్దు వల్ల రాష్ట్రానికి నష్టం లేదని పార్థసారధి పేర్కొన్నారు.

రాజకీయ అవసరాల కోసమే అలా చిత్రీకరించారు..
రాష్ట్రాభివృద్ధి సాధించాలంటే అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్ర ద్వారా అన్ని ప్రాంతాల ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారని.. ప్రాంతాల మధ్య సమతుల్యత చేయాలనుకున్నారని చెప్పారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమది ఘనమైన చరిత్ర అని, రాజకీయ అవసరాల కోసం హత్యా రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు మాత్రమే సీమలో ఉన్నాయని టీడీపీ చిత్రీకరించిందని మండిపడ్డారు.

మండలి రద్దు తీర్మానానికి మద్దతు..
‘మహావిష్ణువు స్వయంభూ గా వెలసిన ప్రాంతం రాయలసీమ.. ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య జన్మించిన ప్రాంతం..చిత్రరాజాలు తీసిన కేవిరెడ్డి జన్మించిన ప్రాంతమని’ భూమన తెలిపారు. రాయలసీమకు అన్యాయం చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో తీసుకురావాలని  సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. మండలిలో బిల్లులను అడ్డుకోవడం చంద్రబాబు సైంధవుడి పాత్రకు నిదర్శమన్నారు. ఒకప్పుడు మండలిలో మహానుభావులు ఉంటే.. ఇప్పుడు కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లోని నిందితులు, ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలవని వారు, భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో గెలవలేని వారు ఉన్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం జగన్‌ చేస్తున్న మండలి రద్దు తీర్మానానికి మద్దతు ఇస్తున్నామని భూమన పేర్కొన్నారు.

(చదవండి: శాసనమండలి రద్దును స్వాగతిస్తున్నాం!)

(చదవండి: టీడీపీది శునకానందం: పేర్ని నాని)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top