 
													చిత్తూరు, సాక్షి: ప్రజా సమస్యలు తెలుసుకోవడమే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు సంఘీభావంగా ఆ పార్టీ నాయకులు చేపట్టిన పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలు రెండో రోజైన ఆదివారమూ జిల్లావ్యాప్తంగా సాగాయి. ప్రజలకు బాసటగా పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి, తిరుపతి, పూతలపట్టు, పలమనేరు, సత్యవేడు, మదనపల్లె నియోజకవర్గాల్లో ప్రజలతో నాయకులు మమేకమయ్యారు. ప్రజలు తమ సమస్యలను నాయకుల దృష్టికి తెచ్చారు.
⇒ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి తిరుపతి ఎస్టీవీ నగర్ మాతమ్మగుడిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. బెల్ట్ షాపుల వల్ల కాలనీలో మద్యం ఏరులై పారుతోందని ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. 2019 వరకు పెన్షన్లు, రేషన్ రాక అవస్థలు పడుతున్న ఆరుగురు నిరుపేదలకు వెయ్యి రూపాయలు, 25 కేజీల బియ్యం ఇవ్వడానికి పార్టీ నేతలు ఎస్కే బాబు, ఆంజనేయులు ముందుకు వచ్చారు.
⇒ మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి సప్పిరెడ్డిగారిపల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. జన్మభూమి కమిటీల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పెన్షన్లు, రేషన్ సరుకులు అనర్హులకు దక్కుతున్నాయని వాపోయారు. సర్పంచ్ శరత్‌రెడ్డి పాల్గొన్నారు.
⇒ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి రేణిగుంటలోని తారకరామనగర్‌లో పల్లె నిద్ర చేశారు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలు విన్నారు.
⇒ పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం మత్యం పంచాయతీ జోగివారిపల్లిలో ఎమ్మెల్యే సునీల్‌కుమార్ రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదని, పక్కా గృహాలు, రేషన్ కార్డులు ఇవ్వకుండా జన్మభూమి కమిటీ సభ్యులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. సర్పంచ్ మయూరి జగన్నా«థ్‌రెడ్డి పాల్గొన్నారు.
⇒ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్తలు సీవీకుమార్, రెడ్డెమ్మ, రాకేశ్‌రెడ్డి వీకోట మండలం గోనుమాకులపల్లె దళితవాడలో పల్లెనిద్ర చేశారు. వైఎస్సార్‌సీపీకి ఓటేసిన వారికి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా జన్మభూమి కమిటీ సభ్యులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రజలు వివరించారు.
⇒ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం బుచ్చినాయుడుకండ్రిగ మండలం నీర్పాకోటలో పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. తాగునీరు, పింఛన్లు రావడం లేదని ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి విద్యానాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
