‘అగ్రిగోల్ట్‌ బాధితులకు అండగా ఉంటాం’

YSRCP Leaders Relay For Justice To Agrigold Victims - Sakshi

సాక్షి, విజయవాడ : న్యాయం కోసం 20 లక్షల మంది అగ్రిగోల్ట్‌ బాధితులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని వైఎస్సార్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. అగ్రిగోల్ట్‌ బాధితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాచౌక్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండో రోజు రిలే దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ.. అగ్రిగోల్ట్‌ ఆస్తులు కాజేయాడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఇప్పటి వరకు బాధితులకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సాయం కూడా అందలేదని ఆరోపించారు. 260మంది అగ్రిగోల్ట్‌ బాధితులు ఆత్మహత్య చేసుకుంటే కేవలం 143మందికి మాత్రమే పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. బాధితుల జాబితా ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో పెట్టలేదన్నారు. అగ్రిగోల్ట్‌ బాధితుల సమస్యలపై వైఎస్‌ జగన్‌ అసెంబ్లీలో ప్రశ్నించారని గుర్తు చేశారు. కృష్ణా జిల్లాలో అగ్రిగోల్ట్‌ సంస్థకు వెయ్యి కోట్ల ఆస్తి ఉందని ఆరోపించారు. బాధితులకు అండగా ఉంటూ..న్యాయం జరిగేవరకు ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top