ప్రజల మధ్యలో..

ysrcp leaders conduct rachabanda and pallenidra in srikakulam - Sakshi

రెండోరోజూ రచ్చబండ, పల్లెనిద్రకు ప్రజాస్పందన అమోఘం

నాయకుల వద్ద సమస్యల ఏకరువు  

శ్రీకాకుళం అర్బన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రెండో రోజు ఆదివారం నిర్వహించిన రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమానికి ప్రజల నుంచి అమోఘ స్పందన లభిం చింది. పార్టీ నేతలు ఆయా గ్రామాలకు వెళ్లి వారు పడుతున్న బాధలు, సమస్యలను స్వయంగా పరిశీలిస్తున్నారు. దీంతో నాయకుల వద్దకు ప్రజలంతా చేరుకుని తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. టీడీపీ అరాచకాలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరమగీతం పాడుతారని, ఆయన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితే ప్రజల సమస్యలు ప రిష్కారం అవుతాయని నాయకులు ప్రజల కు చెబుతున్నారు.

ఆమదాలవలస నియోజకవర్గంలోని బూర్జ మండలం సోమిదలవలస గ్రామ నుంచి పార్టీ జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో పాదయా త్ర  ప్రారంభమైంది. అక్కడి నుంచి మశానపుట్టి, జంగాలపాడు, బొడ్డపాడు గ్రామం వరకు పాదయాత్ర జరిగింది. మశానపుట్టి, జంగాలపాడు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలు  తెలుసుకున్నారు. నవరత్నాల పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలను ప్రధాన ప్రతిపక్షం లేకుండానే నిర్వహించడం బాబుకే చెల్లిందన్నారు. ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, మండల పార్టీ అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, యువజన విభాగం అధ్యక్షుడు గుమ్మడి రాంబా బు, జిల్లా పార్టీ కార్యదర్శులు వావిలపల్లి గోవిందరావు, మామిడి శ్రీనివాసరావు, నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

సీతంపేట మండలం సోమగండి గ్రామంలో ఎమ్మెల్యే కళావతి ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన సమస్యలను పాలక పార్టీ నేతలు గాలికొదిలేశారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎస్‌.లక్ష్మి, సర్పంచ్‌ ఎస్‌. గోపాల్, పార్టీ మండల కన్వీనర్లు జి. సుమిత్రరావు, ఆరిక కళావతి తదితరులు పాల్గొన్నారు.
రాజాం నగరపంచాయతీ పరిధి శిమ్మయ్యపేట గ్రామంలో ఆదివారం ఎమ్మె ల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలపై ఆరా తీసి వాటి పరిష్కారం కోసం ఎమ్మెల్యే సంబంధిత శాఖాధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జోగులు మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు. హంగులూ, ఆర్భాటాలు, ప్రచారాలకే ప్రభుత్వం పరిమితమవుతోందని, ప్రజా సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
నరసన్నపేట పోలాకి మండలం ఉర్జాం గ్రామంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్‌ ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు గ్రామంలోని సమస్యలను కృçష్ణదాస్‌ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్వహిస్తున్న పథకాల ఎంపికపై ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పోలాకి మండలానికి చెందిన పార్టీ నాయకులు కరిమి రాజేశ్వరరావు, కణితి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
కవిటి మండలం డి.గొనపపుట్టుగ గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిం చారు. ఎస్సీలకు వడ్డీలేని రుణాలు గాని, రాయితీ వడ్డీ రుణాలు గానీ లేకపోవడంతో బ్యాంకుల్లో చేసిన అప్పులకు అసలు కన్నా వడ్డీ ఎక్కువై బకాయిలు భారీగా పేరుకుపోయాయని ఎస్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలో ఎస్సీ వీధికి చెందిన ఎవరైనా చనిపోతే శ్మశాన వాటిక కూడా సరైన సదుపాయాలతో లేదని, ఆధునిక హుంగులతో కూడిన శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని పలువురు మహిళలు కోరారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పీఎం తిలక్, నర్తు చామంతి, శ్యామ్‌కురియా, బి. జయప్రకాశ్, కడియాల ప్రకాశ్, తడక జోగారావు, పిట్టా ఆనంద్‌కుమార్, మడ్డు రాజారావు, సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top