చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఎంపీ మేకపాటి | ysr congress party mp mekapati rajamohanreddy fires on cm chandrababu | Sakshi
Sakshi News home page

Feb 17 2018 6:58 PM | Updated on Aug 14 2018 11:26 AM

ysr congress party mp mekapati rajamohanreddy fires on cm chandrababu - Sakshi

సాక్షి, ఒంగోలు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. బాబు పాలన ఎప్పుడు అంతమవుతుందా అని  ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

దేశంలోనే పెద్ద అవినీతిపరుడు చంద్రబాబు అని ఎంపీ మేకపాటి నిప్పులు చెరిగారు. కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలో చంద్రబాబుకి బాగా తెలుసునని వ్యాఖ్యానించారు.  ఏం అవసరం ఉండి వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను చంద్రబాబు లాక్కున్నారని ప్రశ్నించారు. చంద్రబాబును ప్రధాని నరేంద్రమోదీ కూడా నమ్మడం మానేశారని, అందుకే బాబు  కొత్త డ్రామాలు మొదలెట్టారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ 5 వరకు పార్లమెంట్ వేదికగా పోరాటం చేస్తామని, అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే ఎంపీలం రాజీనామా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్ ఉక్కుమనిషి అని, ఆయన పోరాటాన్ని ఆపరని ఎంపీ మేకపాటి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement