‘వైఎస్సార్‌ పాలన కోసమే ఆయన పోరాటం’ | YS Jagan Struggle For YSR Rule In AP Says Botsa | Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్‌ పాలన కోసమే ఆయన పోరాటం’

Feb 22 2019 3:44 PM | Updated on Feb 22 2019 4:03 PM

YS Jagan Struggle For YSR Rule In AP Says Botsa - Sakshi

కలెక్టర్ ఆఫీస్‌లో భూ రికార్డులు తారు మారు అవుతున్నాయంటే.. మంత్రి తీరు ఎలా వుందో అర్థం అవుతోంది అంటూ..

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఓట్ల కోసమో.. అధికారం కోసమో పోరాటం చేయటంలేదని, సమాజంలో సుపరిపాలన, స్వర్గీయ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన తీసుకురావటానికే పోరాడుతున్నారని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాయలు, అబద్దాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

రానున్న కాలంలో భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు చేయని విధంగా రాష్ట్ర ప్రజల కోసం వైఎస్‌ జగన్ పరిపాలన చేస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం.. సంక్షేమ రాజ్యం కోసం వైఎస్‌ జగన్ సీఎం అవ్వాలని స్పష్టం చేశారు. గంటా శ్రీనివాసరావు ఓ మంత్రిగా ఉంటూ భీమిలిలో అభివృద్ది చేశారా అని ప్రశ్నించారు. కలెక్టర్ ఆఫీస్‌లో భూ రికార్డులు తారు మారు అవుతున్నాయంటే.. మంత్రి తీరు ఎలా వుందో అర్థం అవుతోంది అంటూ మండిపడ్డారు. 5 ఏళ్లుగా గంటా మంత్రిగా ఉన్నారు, ఏమి చేశారు.. అక్రమాలు, భూ కబ్జాలు తప్ప అంటూ ఆగ్రహం వ్యకం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement