రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తాం | We will create a new trend in politics | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తాం

Mar 12 2018 2:40 AM | Updated on Mar 28 2018 11:26 AM

We will create a new trend in politics - Sakshi

బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న ఎర్ర రామేశ్వర్‌గౌడ్‌

నందిగామ(షాద్‌నగర్‌): షాద్‌నగర్‌ రాజకీయాల్లో తెలంగాణ ఇంటి పార్టీ త్వరలోనే నూతన ఒరవడి సృష్టిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ అన్నారు. నందిగామకు చెందిన విద్యావేత్త ఎర్ర రామేశ్వర్‌గౌడ్‌ తన అనుచరులతో కలసి ఆదివారం షాద్‌నగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సుధాకర్‌ సమక్షంలో తెలంగాణ ఇంటి పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతూ తమ పార్టీ ప్రజల ఆంక్షలమేరకు పనిచేస్తుందని అన్నారు. అంతకుముందు కొత్తూరులో రామేశ్వర్‌గౌడ్‌ భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. బైపాస్‌ చౌరస్తాలోని అంబేడ్కర్, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement