
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓటమికి ముందు సీఎం చంద్రబాబుకు అసహనం పెరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆదివారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చంద్రబాబును కలవకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టా? వాటీజ్ డెమాక్రసీ? ఎన్నికలంటే ఏమిటి? ఎవరో డబ్బు సమకూరుస్తారు. ఇంకొకరు ఖర్చుపెట్టి గెలుస్తారు’ అని మాట్లాడటమేంటి చంద్రబాబూ? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఓడిపోయే ముందు చంద్రబాబుకు అసహనం అమాంతం పెరిగినట్టుందన్నారు.