
సాక్షి, ఏలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అవకాశవాదని, జాగ్రతగా ఉండాలని అధిష్టానాన్ని హెచ్చరించామని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుతో జతకట్టే ప్రసక్తే లేదని వట్టి వసంతకుమార్ స్పష్టం చేశారు. పోలవరం, పట్టిసీమతో పాటు ఇతర పథకాల్లో కూడా భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. యూపీఏ అధికారంలోకి వస్తే ఏపీలో గత నాలుగేళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ప్లీనరీలోనే తొలిసారిగా తీర్మానించామని తెలిపారు.