‘గతంలో జరిగిన అక్రమాలకు బాబు సమాధానం చెప్పాలి’

TTD Chairman YV Subba Reddy Slams On Chandrababu Naidu And TDP In East Godavari - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: ఐటీ దాడులతో టీడీపీ నేతల అసలు స్వరూపం బయట పడిందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి అన్నారు. రామచంద్రపురంలో తోట త్రిమూర్తులు అధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసేందుకే యాత్ర పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో డ్రామాకు తెర లేపారని విమర్శించారు. అయిదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. బాబు నయవంచక యాత్రను ప్రజలు తిప్పికొట్టాలని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని తెలిపారు.

ఇక వచ్చే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయ దుందుభి మోగించడానికి రామచందద్రాపురం తొలిమెట్టు కావాలన్నారు. తొమ్మిది నెలల్లో సీఎం జగన్‌ నవరత్నాలతో పాటు అనేక రకాల పథకాలను ప్రజల అందించారని సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం తోట త్రిమూర్తులు అధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు పార్టీలో చేరారు. కాగా ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డితో పాటు డిప్యుటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంతత్రులు కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, ఎంపీ అనురాధ, ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్‌ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

చంద్రబాబు కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు జరపాలి 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top