హాత్రస్‌లో రంగు పడేదెవరికి..

Triangular fight in Hathras - Hathras lok sabha elections - Sakshi

హాత్రస్‌

మహాగఠ్‌ బంధన్‌ నుంచి గట్టి పోటీ

బీజేపీ, కాంగ్రెస్‌ కూడా హోరాహోరీ

‘రంగుల’ పరిశ్రమలో ఎవరికో పట్టం?

హాత్రస్‌.. యూపీలోని ఒక కీలక నియోజకవర్గం. ఈ పేరు వినగానే అందరికీ రంగుల హోలీ పండుగ గుర్తొస్తుంది. యూపీలో హాత్రస్‌ రంగులకి దేశవ్యాప్తంగా క్రేజ్‌ ఉంది. ఎన్నికల వేళ ఏ పార్టీకి రంగు పడుతుందా అన్న ఆసక్తి నెలకొంది. హాత్రస్‌లో అభివృద్ధి కంటే పేరు మార్పు శరవేగంగా జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా? అవును ఇది నిజం. రాష్ట్రంలో పార్టీ అధికారం మారిన ప్రతీసారి పేరుని మార్చి పారేస్తుంటారు. ఈ నేమ్‌ ఛేంజ్‌ పార్టీల మధ్య ఒక గేమ్‌గా మారింది.

ఎన్నిసార్లు పేరు మార్చారంటే..
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ జిల్లాలో ఉండే హాత్రస్‌ పేరు మార్పు మొదటిసారిగా 1997లో జరిగింది. అప్పుట్లో యూపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి హాత్రస్‌ను మహామాయానగర్‌ అని మార్చి జిల్లా హోదా కల్పించారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ప్రభుత్వం అధికారంలోకి రాగానే ములాయం సింగ్‌ యాదవ్‌ తిరిగి హాత్రస్‌ పేరుని పునరుద్ధరించారు. 2007లో మాయావతి అధికారంలోకి రాగానే మళ్లీ మహామాయానగర్‌ అని పిలవాలని హుకుం జారీ చేశారు. 2012లో అఖిలేష్‌ యాదవ్‌ సీఎం కుర్చీ ఎక్కగానే మళ్లీ పాత పేరునే పెట్టేశారు. ప్రస్తుతానికైతే హాత్రస్‌ పేరుతోనే ఈ జిల్లా కొనసాగుతోంది. ఇలా పార్టీ మారిన ప్రతీసారి పేరు మారుస్తుండటంతో అక్కడి ప్రజలు విసిగిపోయారు. పేరు మార్చడానికి చూపించే శ్రద్ధ జిల్లా అభివృద్ధిలో ఎందుకు లేదని స్థానికులు నిలదీస్తున్నారు.

హాత్రస్‌ దేనికి ప్రసిద్ధి అంటే..
ఈ నియోజకవర్గంలో హోలీ రంగుల తయారీయే అతి పెద్ద పరిశ్రమ. ఇక్కడ దొరికే ఇంగువ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందితే, ఆభరణాల్లో వాడే రంగురాళ్లకి గిరాకీ ఎక్కువే. ఇక బంగాళదుంప పంటకి పెట్టింది పేరు. కానీ ప్రాసెసింగ్‌ యూనిట్లు లేక చాలామంది రైతులు దుంపల్ని ఇప్పుడు సాగు చేయడం లేదు.

రాజకీయ చరిత్ర
ఎస్సీలకు రిజర్వు చేసిన హాత్రస్‌ లోక్‌సభ నియోజకవర్గంలో కమలనాథులదే ఎప్పుడూ హవా. ఇప్పటికే ఆరుసార్లు ఇక్కడ గెలిచిన బీజేపీ ఏడోసారి కూడా గెలుపు కోసం తహతహలాడుతోంది. 1996–2009 మధ్య కాలంలో బీజేపీకి చెందిన కిషన్‌ లాల్‌ దిలేర్‌ నాలుగుసార్లు గెలిచారు. ఆ తర్వాత రాష్ట్రీయ లోక్‌దళ్‌కి చెందిన సారిక బఘేల్‌ ఆ స్థానంలో గెలుపొందారు. తిరిగి గత ఎన్నికల్లో బీజేపీకి చెందిన రంజన్‌ కుమార్‌ దివాకర్‌ గెలుపొందారు.

పోటీ ఎలా ఉందంటే..
ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ, జాటవ్‌ సామాజిక వర్గానికి చెందిన రంజన్‌కుమార్‌ను పక్కన పెట్టి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన కిషన్‌లాల్‌ దిలేర్‌ కుమారుడు రాజ్‌వీర్‌ సింగ్‌కు దిలేర్‌కు సీటు ఇచ్చింది. ఇక్కడ వల్మీకి వర్గం మద్దతు బీజేపీకి లభించకపోవచ్చని అంచనా. ఎస్పీ–బీఎస్పీ–ఆర్‌ఎల్డీ కూటమి రాంజీలాల్‌ సుమన్‌ను బరి లోకి దింపింది. ఫిరోజాబాద్‌ నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన సుమన్‌కు ఎస్‌సీ, జాటవులు, ముస్లింల మద్దతు లభించే అవకాశాలున్నాయి. దీనికి సాయం కూటమి ఓటు బ్యాంకుతో ఆయన పవర్‌ఫుల్‌ అభ్యర్థిగా కనిపిస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున త్రిలోక్‌రామ్‌ దివాకర్‌ బరిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు

20-05-2019
May 20, 2019, 20:46 IST
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ నార్త్‌ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఓటమి తప్పదని...
20-05-2019
May 20, 2019, 20:24 IST
ఐటీ గ్రిడ్‌ నిందితుడు అశోక్‌, ఫోర్జరీ కేసు నిందితుడు, టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌, కోడికత్తి కేసు..
20-05-2019
May 20, 2019, 19:57 IST
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో ఫారం–17సీ పార్ట్‌–2 ఎంతో కీలకమైంది. ప్రతి కౌంటింగ్‌ ఏజెంట్, పరిశీలకులు, సహాయ...
20-05-2019
May 20, 2019, 19:24 IST
ఎగ్జిట్‌ వార్‌ : విపక్షాలపై బీజేపీ మండిపాటు
20-05-2019
May 20, 2019, 19:09 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఎన్నికల్లో బీజేపీని అడ్డుకోకపోతే కాంగ్రెస్‌ పార్టీ చావాల్సిందేనని స్వరాజ్‌ ఇండియా చీఫ్‌ యోగేంద్ర యాదవ్‌ అన్నారు. దేశ వ్యాప్తంగా వెల్లడైన...
20-05-2019
May 20, 2019, 18:53 IST
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ముందు ఈవీఎంలను కాకుండా వీవీ ప్యాట్‌లను లెక్కించేలా...
20-05-2019
May 20, 2019, 18:16 IST
దీదీతో అఖిలేష్‌ మంతనాలు
20-05-2019
May 20, 2019, 17:49 IST
ఎగ్జిట్‌ పోల్స్‌కు అనుగుణంగా ఫలితాలు..
20-05-2019
May 20, 2019, 17:32 IST
సాక్షి, అమరావతి: రీపోలింగ్‌ ముగియడంతో ఎన్నికల సంఘం కౌంటింగ్‌పై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌లో 34 చోట్ల 55 కేంద్రాల్లో కౌంటింగ్‌...
20-05-2019
May 20, 2019, 17:31 IST
సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాలకు తక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటిస్తే సా​ధారణంగానే వారు ఆ ఫలితాలను తప్పుపడతారని బీజేపీ జాతీయ...
20-05-2019
May 20, 2019, 16:23 IST
సాక్షి, న్యూఢిల్లీ:  నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. దీనిపై...
20-05-2019
May 20, 2019, 16:22 IST
సాక్షి, హైదరాబాద్‌ : జిల్లా పార్లమెంట్ ఎన్నికల వివరాలు సోమవారం విడుదలయ్యాయి. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 17,86,515...
20-05-2019
May 20, 2019, 15:48 IST
2019 సార్వత్రిక లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడడంతో సగం ఉత్కంఠకు తెరపడింది. దాదాపు అన్ని...
20-05-2019
May 20, 2019, 15:32 IST
సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి మాదిరిగా ఎప్పటికప్పుడు రంగులు మారుస్తారంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తారన్న సంగతి తెలిసిందే. ఏ...
20-05-2019
May 20, 2019, 15:05 IST
కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారాన్ని చేపట్టబోతుందని స్పష్టమైన సంకేతాలు వెలువడటంతో
20-05-2019
May 20, 2019, 14:40 IST
కమల్‌కు ముందస్తు బెయిల్‌
20-05-2019
May 20, 2019, 14:40 IST
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ విషయమై ఆర్మీ నార్తన్‌ కమాండ్‌ జనరల్‌ ఆఫీసర్‌...
20-05-2019
May 20, 2019, 14:08 IST
సాక్షి, కాకినాడ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కళ్లలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
20-05-2019
May 20, 2019, 14:06 IST
ఎన్డీయే నేతలతో అమిత్‌ షా విందు భేటీ
20-05-2019
May 20, 2019, 13:21 IST
సాక్షి, చెన్నై: తాజాగా వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను డీఎంకే అధినేత స్టాలిన్‌ కొట్టిపారేశారు. ఏడో విడత ఎన్నికలు ముగియడంతో...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top