ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్ ‌సీపీలోనే.. | Tirupati MP Balli Durga Prasada Rao Fires On Yellow Media | Sakshi
Sakshi News home page

ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్ ‌సీపీలోనే: ఎంపీ

Jun 29 2020 6:27 PM | Updated on Jun 29 2020 8:22 PM

Tirupati MP Balli Durga Prasada Rao Fires On Yellow Media - Sakshi

సాక్షి, తిరుపతి: ప్రాణం ఉన్నంత వరకు తాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు స్పష్టం చేశారు. తాను పార్టీ మారతానంటూ తప్పుడు కథనాలు ప్రసారం చేసిన వారిపై కేసులు పెడతానని హెచ్చరించారు. తన 30 ఏండ్ల రాజకీయ జీవితంలో ఏనాడు మీడియా ఇంత దారుణంగా వ్యవహరించలేదని.. ఎల్లో మీడియా ఆగడాలు శ్రుతి మించుతున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియాతో నాటకాలు ఆడిస్తూ ప్రభుత్వాన్ని విమర్శల పాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారుపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. (ధ్రువీకరణ పత్రం అందుకున్న మాణిక్య వరప్రసాద్‌)

చదవండి: భావోద్వేగానికి లోనైన మంత్రి పేర్ని నాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement