
సాక్షి, అమరావతి : రెబల్ అభ్యర్థులపై తెలుగుదేశం పార్టీ వేటు వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన పార్టీ నేతలు స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పినా పోటీ నుంచి తప్పుకోకపోవడంతో రెబల్స్‌పై వేటు వేశారు. దీంతో పార్టీని ధిక్కరించి...పోటీ చేస్తున్న 9మంది అభ్యర్థులపై వేటు వేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయినవారు...
1. రంపచోడవరం - కేవీఆర్‌కే ఫణీశ్వరి
2. గజపతి నగరం - కే.శ్రీనివాసరావు
3. అవనిగడ్డ - కంఠమనేని రవి శంకర్
4. తంబళ్లపల్లి - ఎం.మాధవరెడ్డి
5. తంబళ్లపల్లి - ఎన్.విశ్వనాథ్ రెడ్డి
6. మదనపల్లె - బొమ్మనచెరువు శ్రీరాములు
7. బద్వేల్ - ఎన్. విజయజ్యోతి
8. కడప - ఏ.రాజగోపాల్ రెడ్డి
9. తాడికొండ - సర్వా శ్రీనివాసరావు