హామీలు నెరవేర్చకుంటే బట్టలిప్పి కొట్టండి! | Tear his clothes, reprimand him if he doesnot deliver | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేర్చకుంటే బట్టలిప్పి కొట్టండి!

Apr 22 2019 4:11 AM | Updated on Apr 22 2019 4:11 AM

Tear his clothes, reprimand him if he doesnot deliver - Sakshi

మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌

ధనోరా: లోక్‌సభ ఎన్నికల్లో ఛింద్వారా నుంచి తన కుమారుడు నకుల్‌నాథ్‌ను గెలిపించాలని మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ ప్రజలను కోరారు. ఒకవేళ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుంటే అతని దుస్తులను చించివేసి శిక్షించాలని సూచించారు. ధనోరా గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఛింద్వారా నియోజకవర్గంతో తన 40 ఏళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కమల్‌నాథ్‌..‘నకుల్‌ ప్రస్తుతమిక్కడ లేకపోయినా మీకు సేవ చేస్తాడు. నకుల్‌కు ఆ బాధ్యతను నేను అప్పగించాను. మీరిచ్చిన శక్తి, ప్రేమ వల్లే నేను ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాను. మనం త్వరలోనే సరికొత్త చరిత్రను సృష్టించడంతో పాటు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం’ అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement