18 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కారాలు | shiv sena activist pray for leader win in assembly constituency in solapur | Sakshi
Sakshi News home page

18 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కారాలు

Oct 27 2019 5:05 AM | Updated on Oct 27 2019 5:05 AM

shiv sena activist pray for leader win in assembly constituency in solapur - Sakshi

సాక్షి, ముంబై: తన ప్రియతమ నాయకుడు గెలిచాడని బాపు జావీర్‌ అనే కార్యకర్త ఏకంగా 18 కిలోమీటర్లు సాష్టాంగ నమస్కారాలు చేపట్టి మొక్కు తీర్చుకున్నారు. షోలాపూర్‌ జిల్లా సాంగోలా అసెంబ్లీ నియోజకవర్గంలో శివసేన అభ్యర్థి శహాజీ బాపు పాటిల్‌ విజయం సాధించారు. పాటిల్‌ విజయం కోసం సాంగోలా బాపు జావీర్‌ తనవంతు కృషి చేశారు. పాటిల్‌ విజయం సాధిస్తే స్వగ్రామం సుపాలే నుంచి పండర్‌పూర్‌ వరకు సాష్టాంగ నమస్కారాలు చేసి విఠలేషున్ని దర్శించుకుంటానని జావీర్‌ మొక్కుకున్నాడు. పాటిల్‌ గెల్చిన విషయం తెల్సి.. జావీర్‌ సుపాలి గ్రామం నుంచి 18 కిలోమీటర్ల దూరం ఉన్న పండర్‌పూర్‌ వరకు సాష్టాంగ నమస్కారాలు పెట్టుకుంటూ వెళ్లాడు. ఎండలో తారు రోడ్డుపై, మట్ట రోడ్డుపై సాష్టాంగ నమస్కారాలు పెట్టిన దృశ్యం వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement