‘కేసీఆర్‌ ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్నారు’

Shabbir Ali Slams KCR Over Reservation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్నారని ఎమ్మెల్సీ షబ్బీర్‌ ఆలీ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  పంచాయితీల్లో కోర్టును సాకుగా చూపి బీసీలను కేసీఆర్ మోసం చేశారని అన్నారు. ఎస్టీ, ముస్లింల రిజర్వేషన్ ఎటుపోయాయో కేసీఆర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. యాభై శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చి బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్‌కు బీసీలపై ప్రేమఉంటే.. బీసీ రిజర్వేషన్లపై  ఎందుకు కోర్టులో రివ్వ్యూ పిటిషన్ వేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ అబద్దాలు కొన్ని రోజులే నడుస్తాయని అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపై కారణాలను సమీక్షించుకుంటున్నామని తెలిపారు. పొరపాట్లను సరిదిద్దుకుంటామని, రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ రెడీగా ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను తప్పక ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి.. కాంగ్రెస్‌ను ప్రజలు తప్పక గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఫలితాలకు భిన్నంగా లోక్ సభ ఎలక్షన్ ఫలితాలు ఉంటాయని జోష్యం చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter | తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top