జెడ్పీలో అజెండాగా మారిన ‘సాక్షి’ కథనం | Sakshi Story Witness In Kakinada Zp Meeting East Godavari | Sakshi
Sakshi News home page

జెడ్పీలో అజెండాగా మారిన ‘సాక్షి’ కథనం

May 25 2018 8:03 AM | Updated on Aug 10 2018 8:42 PM

Sakshi Story Witness In Kakinada Zp Meeting East Godavari

జెడ్పీ సమావేశంలో సాక్షి క్లిప్పింగ్‌ను చూపించి మాట్లాడుతున్న జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్‌

సాక్షి ప్రతినిధి, కాకినాడ : జెడ్పీ సమావేశంలో ‘సాక్షి’ కథనమే అజెండాగా మారింది. ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన ‘ఎక్కడా చూసినా అవినీతే’ కథనంలోని అంశాలనే సభ్యులు దాదాపుగా ప్రస్తావించారు. నత్తనడకన సాగుతున్న  డెల్టా ఆధునికీకరణ పనులు, హడావుడి పనులతో జరిగే అక్రమాలు, నీరు చెట్టు పనుల్లో అక్రమాలు, బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం, మన్యంలో వైద్యం అందక చనిపోతున్న గిరిజనుల వ్యవహారంపై జెడ్పీ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఇక, ఇసుక అక్రమ తవ్వకాల విషయమైతే పెద్ద దుమారమే రేపింది. గిరిజనులకు కట్‌ చేసిన కిరోసిన్‌తో పడుతున్న అవస్థలపై కూడా చర్చించారు. ఈ అంశాలన్నీ గురువారం ప్రచురితమైన ‘సాక్షి’ కథనంలో ప్రముఖంగా ప్రస్తావించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement