అమర వీరుల కుటుంబాలకు అవకాశం | Revanth seeks RS ticket to martyrs families | Sakshi
Sakshi News home page

అమర వీరుల కుటుంబాలకు అవకాశం

Mar 2 2018 4:38 AM | Updated on Mar 2 2018 4:38 AM

Revanth seeks RS ticket to martyrs families - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై తమ పార్టీలో కూడా చర్చ జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో రేవంత్‌ మాట్లాడుతూ.. సంఖ్యాబలం ప్రకారం టీఆర్‌ఎస్‌కు రెండే రాజ్యసభ స్థానాలు వస్తాయని, ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మూడోది గెలవాలి కనుక తమ ఆలోచనకు అనుగుణంగా అమరవీరుల కుటుంబాలకు అవకాశమివ్వాలని అభిప్రాయపడ్డారు. తన బంధువు సంతోష్‌ను రాజ్యసభకు పంపాలని కేసీఆర్‌ యోచిస్తున్నారని, రాజ్యసభకు వెళ్లే అర్హత సంతోష్‌కు ఏముందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌కు సపర్యలు చేయడమే సంతోష్‌ అర్హతా? అని ఎద్దేవా చేశారు. అమరవీరుల కుటుంబాలకు అవకాశం ఇవ్వకపోతే కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దింపుతామని రేవంత్‌ హెచ్చరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement