‘రాజీనామా స్పీకర్‌కు పంపలేదు.. సీఎంకే పంపాను’

Resignation Not Sent To Assembly Speaker Says Pydikondala Manikyala Rao - Sakshi

సాక్షి, అమరావతి : నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందంటూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆయన దీక్ష కూడా చేపట్టారు. బుధవారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. రాజీనామా పత్రాలను సీఎం చంద్రబాబుకు మాత్రమే పంపానని, స్పీకర్‌కు పంపలేదని స్పష్టం చేశారు. ‘రాజీనామా ఆమోదించాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉంది. నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకే వచ్చాను. నా దీక్ష నియోకవర్గంలోనే కాదు. జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది’ అని చెప్పుకొచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top