రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ హవా | Rajasthan Election Result 2018 Live Updates | Sakshi
Sakshi News home page

Dec 11 2018 8:59 AM | Updated on Dec 11 2018 10:07 AM

Rajasthan Election Result 2018 Live Updates - Sakshi

ఊహించినట్టుగానే రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ దూసుకుపోతోంది.

జైపూర్‌: ఊహించినట్టుగానే రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ దూసుకుపోతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్‌ 108, బీజేపీ 76, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. కాగా, కాంగ్రెస్‌ 145 స్థానాల వరకు గెల్చుకునే అవకాశముందు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

ముఖ్యమంత్రి వసుంధర రాజె, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లట్‌, కాంగ్రెస్‌ నాయకుడు సచిన్‌ పైలట్‌ ఆధిక్యంలో ఉన్నారు. ఉదయ్‌పూర్‌ మంత్రి గులాబ్‌చంద్‌ కఠారియా వెనుకంజలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement