గుజరాత్‌ ఎన్నికలు.. గెలిస్తే వాటి మహిమే! | Raj Thackeray on Gujarat BJP's Lost | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం!

Oct 29 2017 10:36 AM | Updated on Jul 11 2019 8:26 PM

Raj Thackeray on Gujarat BJP's Lost - Sakshi

సాక్షి, ముంబై : ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గుజరాత్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటమి తప్పదని రాజ్ థాక్రే అంటున్నారు. శనివారం ఓ బహిరంగ సభలో పాల్గొన్న  మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్.. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై వ్యాఖ్యలు చేశారు.

’’గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోతుంది. ఇది నేను చెబుతుంది కాదు.. తాజా నివేదికలు, సర్వేలు చెబతుతున్నాయి. మోదీ మాట్లాడుతుంటే ప్రజలు లేచివెళ్లిపోతున్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. ఇది ఆయన పాలనపై అసంతృప్తితో ఉన్నారన్నటానికి సంకేతమనే భావించవచ్చు. ఒకవేళ వాళ్లు(బీజేపీ) చెబుతున్నట్లు 150 సీట్లు గెలవాలంటే ఓ అద్భుతం జరగాలి. అది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం)ల మహిమన్నది నేను బలంగా నమ్ముతా" అని రాజ్‌ థాక్రే అన్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా రాహుల్ తప్పిదాల వల్లే మోదీ అధికారంలోకి వచ్చారని.. మోదీ ఛరిష్మా కేవలం 15 శాతం మాత్రమే పని చేసిందని రాజ్‌ థాక్రే చురకలంటించారు. పరిస్థితులు దారుణంగా మారిపోయానని.. బీజేపీని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెబుతున్నారు.  కాగా, డిసెంబర్ 9, 14 తేదీల్లో గుజరాత్‌లోని 182 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement